దూరం

తొలకరి జల్లుకు మెరసిన హృదయం,
రోజూ వానకై పరితపించెనే ...
నువ్వు తిరిగి రావని, ఇది ఎండమావని,
నా పిచ్చి మనసు, గ్రహించదెందుకే?


దూరం పెరిగినా, మాటకు నోచుకోకున్న,
ప్రేమ లేదన్న, చెలిమి కూడా కాదన్న,
వదిలిపోతున్న, బాధపెట్టానన్నా,
నా పిచ్చి మనసు, తన ఆశ తనదేగా..


కనుకుపాటు వేళలో విరహ సాహిత్య మాలిక,
రాత మరచిన ప్రాయానికి కవితా గెలియమాలి,
మధుర క్షణాల, మరువలేని జ్ఞపకాల గూటిలో,
నా పిచ్చి మనసు, తన బాణీ తనదేగా..

Comments