నీ బాట నీది

మనసుకి నచ్చావ్, కలనే కన్నా,
దూరంగా వెళ్ళావ్, మరిచిపోలేకున్నా..

మాటలే రాకున్నా ఈ వేళా,
నీ ధ్యాసే రగిలింది సెగలా...

కానీ... నీకు ఇష్టంలేకుంటే?
నా ఊసే నీకు కష్టమైతే?

ఇబ్బంది పెట్టుట భావ్యముకాదు,
మనసు మాట ఆపుట సాధ్యముకాదు...

అర్ధమే కాదులే ఈ సంకటం,
నరకాన్ని పోలెనే ఈ క్షణం...

విరహ తాపము కాదు
విడనాడు బంధము కాదు
నా ప్రేమ నాది, నీ బాట నీది..

Comments