తెలియని భావన

భయం నీదొ నాదొ తెలియదె చెలి,
ఒంటరితనం అలవాటే లేదుగా సరి,
ఈ స్నేహం కొత్తదాయె మరి...

నీ కౌగిలిలో నే కరిగిపోనా,
కన్నీటితో నా భాదే కడిగేయనా,
స్నేహం, మొహం, ప్రేమమ్, అపారం,
పేరేదైనా, కావాలన్నదే మనసే నీ తోడు,
వినిపించాలన్నదే తన వెర్రి గోడు...

నీ నుదుటిపై చెమటి చుక్క,
ఆ బుంగమూతి రేపిన ఊసులు,
గోరుముద్దలు తినిపించిన నా వేళ్లు,
ఊహ కానే కాదె మన మధ్య బంధం,
విడిపోతే రానే రాదె తిరిగి ఈ ఆనందం.
 
భయం నీదొ నాదొ తేలియదె చెలి,
ఒంటరితనం అలవాటే లేదుగా సరి,
ఈ స్నేహం కొత్తదాయె మరి...

Comments