వాంఛ

వెండి వెన్నెల దివి తీరాన,
సాగే ప్రవాహ రాగాన,
మనసున ఆగని దాగని
మాటలనే నీతో తెలుపనా ...

ఇంటి ముంగిట ముగ్గు వేయగా,
ఆరు బయట పందిరిసడిన,
తొంగి చూసి పరవశించి,
నను నేను మరువనా...

మడి చీర వయ్యారంలో,
నడిచే శృంగార వీణ,
నీ తడి కురుల చిక్కుల్లో,
బంధీనై నే జీవించనా...

జాలువారే నీ వాలు జడ,
కొప్పున జాజిమల్లెల సువాసన,
సత్యభామనే తలపింతువులే,
ఆ కోపతాపాల నే సేదతీరనా...

పులకించెనే మది నీ శృతిలో,
కవ్వేనే ఆ మాటల సడిలో,
కనుల వెలుగులు, పెదవి విరుపులు,
మురిసె చెక్కిళ్లు, మెరిసే నా లోగిళ్ళు... 

Comments